సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (రివ్యూ)
హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపుమీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అంటూ ప్రేక్షకులను అలరించడానికి జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన నటించిన ఆర్తన హీరోయిన్ గా పరిచయమైంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీ శైలేంద్ర బాబు నిర్మాతగా వ్యవహరించగా గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు.
కథ :
ఒక అందమైన పల్లెటూరు అందులో సీతామాలక్ష్మి(అర్తన), శ్రీరామ్(రాజ్‌తరుణ్) చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరుగుతారు.. మన శ్రీరామ్ కు మాత్రం సీతామాలక్ష్మి అంటే అమీతమైన ప్రేమ.. కానీ అల్లరి చిల్లరగా తిరుగుతుండటంతో శ్రీరామ్ అంటే సీతామాలక్ష్మికి నచ్చదు. ఆయన కానీ తానని ప్రేమంచమని వెంటపడుతుంటాడు…మనోడి చేష్టలకు ఎలాగో అలాగా ప్రేమలో పడుతుంది…అదే ఊరికి ప్రెసిడెంట్ గా సీతామాలక్ష్మి తండ్రి (రాజారవీంద్ర)కి వీరి ప్రేమ తెలియడంతో, సీతామాలక్ష్మికి పెళ్లి సంబంధం చూస్తాడు. ఇండియా క్రికెట్ టీంకు సెలెక్ట్ అయిన ఆదర్శ్ ను సీతామాలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు.. ఈ లోపు శ్రీరామ్ వెళ్లి ఆదర్శ్ కు తమ ప్రేమ వ్యవహారం చెబుతాడు.. ఆదర్శ్ మాత్రం తనతో క్రికెట్ ఆడి గెలిచి సీతామాలక్ష్మి సొంతం చేసుకొమ్మని పందెం వేస్తాడు.. పందెంకు ఒప్పుకున్న శ్రీరామ్ గెలుస్తాడా లేదా..? సీతామాలక్ష్మి ఎలా దక్కించుకుంటాడు..? అనేది మిగిలిన స్టొరీ
ప్లస్ పాయింట్స్ :
రాజ్ తరుణ్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన స్లాంగ్ తో పాటు కామెడీ సన్నివేశాలలో రాజ్ తరుణ్ అద్భుతంగా నటించాడు. ఇక ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తన తన అభినయంతో కొంత మేర ఫర్వాలేదనిపించింది. రాజ్ తరుణ్ కి స్నేహితుడిగా నటించిన శకలక శంకర్ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఆర్తన తండ్రి పాత్రలో నటించిన రాజారవీంద్ర తన పాత్రకి న్యాయం చేసాడు.
No comments:
Post a Comment