Friday, 29 January 2016

కళావతి movie review

12648007_1023168634413880_546382804_n

కళావతి (రివ్యూ)

ఇటీవల తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘అరణ్మనై’ చిత్రాన్ని తెలుగులో ‘చంద్రకళ’ అనువదించారు. ఇక తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా కామెడి, హారర్ ల కలయికతో దర్శకుడు సుందర్ తెరకెక్కించిన అరణ్మనై-2, తెలుగులో ‘కళావతి’ గా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ లో గుడ్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ భాజ్వాలు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. హైప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్న ఈ చిత్ర కథ విషయానికొస్తే..
కథ :
ఒక ఊరి జమిందార్(రాధారవి) తన గ్రామంలో అమ్మవారి మూలస్థానం క్షీణించడంతో ఆమెను పాలతో అభిషేకం చేసి పునః ప్రతిష్టించాలనుకోని అమ్మవారిని నవధాన్యాల్లో ఉంచుతారు. అలా అమ్మవారిని ఉంచినన్ని రోజులు అమ్మవారి శక్తి క్షీణిస్తుందని, దాంతో ద్రుష్ట శక్తులు బయటికి వచ్చే ప్రమాదం ఉందని అంటారు. అలాంటి సమయంలోనే ఒక ద్రుష్టశక్తి జమిందార్ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. జమిందార్ కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు భార్య, కొడుకుతో వేరే ఊరు వెళ్తే, చిన్న కొడుకు మురళి(సిద్దార్థ్) తన మరదలు అనిత(త్రిష)తో కలిసి ట్రిప్ కోసం బయటికి వెళ్తాడు. ఇక ద్రుష్ట శక్తి ప్రవేశించిన మొదటి రోజు రాధారవిని మేడ పై నుండి తోసేయడంతో కోమాలోకి వెళ్తాడు రాధారవి. ఇక అతనికి సేవ చేయడానికి కేరళ నర్స్ (పూనమ్ భజ్వ) ఇంట్లోకి వస్తుంది. ట్రిప్ నుండి వచ్చిన మురళికి ఇంట్లో పరిస్థితులు కొత్తగా కనిపిస్తాయి. ఒక రోజు రాత్రి అరుపులు,కేకలు వినబడి బయటికి వచ్చేసరికి అంతకు ముందు రోజు మురళితో గొడవపడిన డ్రైవర్ పడి ఉంటాడు. ఇళ్ళు ఖాళీ చేసి పొమ్మని, లేకపోతే మీరు ఆపదలో పడుతారని చెప్పి అతను మరణిస్తాడు. కాని పోలీసులు మాత్రం డ్రైవర్ తో గొడవ పడిన కారణంతోనే మురళి అతన్ని చంపేసాడని అరెస్ట్ చేస్తారు. అప్పుడు మురళి.., అనిత వాళ్ళ అన్నయ్య రవిని తమ ఇంటికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు ఆ ఇంట్లోకి వచ్చిన రవి ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు ? ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరు ? ఎందుకు పగ తీర్చుకోవడానికి వచ్చింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

No comments:

Post a Comment