సాలా ఖడూస్ (రివ్యూ)
మాధవన్ హీరోగా రితిక సింగ్, ముంతాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సాలా ఖడూస్’ చిత్రం తమిళం, హిందీ భాషల్లో జనవరి 29న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సింగ్ క్రీడ నేపధ్యంలో సాగే ఈ సినిమాకి సుధ కొంగర ప్రసాద్ దర్శకత్వం వహించగా సీవి కుమార్, శశికాంత్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్ర కథ విషయానికొస్తే..
కథ :
ఆది తోమర్(మాధవన్) మంచి టాలెంట్ ఉన్న బాక్సింగ్ క్రీడాకారుడు. తన కోచ్ దేవ్ ఖత్రి మరియు ఇతరుల కుట్రతో భారత్ కు బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యం చేజారిపోతుంది. దాంతో నిరాశకి లోనైనా ఆది భారత మహిళ బాక్సింగ్ జట్టుకు కోచ్ గా వెళ్తాడు. అక్కడ కూడా రాజకీయ కారణంతో బదిలీ అయి చెన్నైకి వెళ్తాడు. ఇక తాను సాధించలేకపోయిన గోల్డ్ మెడల్ ని తన శిష్యురాలు అయిన సాధించాలనే కసితో అందుకు తగిన అమ్మాయిని వెతుకుతున్న సమయంలో చేపలు పట్టే కుటుంబానికి చెందిన మది(రితిక సింగ్) ని చూస్తాడు. ఆమె టాలెంట్ ని గ్రహించిన ఆది తన శిష్యురాలిగా మదిని చేసుకొని శిక్షణ ఇస్తుంటాడు. ఇక కోచింగ్ ఇస్తున్నందుకు రోజుకు 500 రూపాయలు ఇచ్చేలా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. అదే సమయంలో ఎలాగైనా పోలీస్ ఉద్యోగం సంపాదించాలని మది అక్క లక్ష్మి(ముంతాజ్ సర్కార్) బాక్సింగ్ సాధన చేస్తుంటుంది. అయితే తన చెల్లెలు మది పట్ల ఆది చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేక కోపంతో ఒక ముఖ్యమైన మ్యాచ్ లో మదిని పాల్గొనకుండా చేస్తుంది. ఇదంతా తెలుసుకున్న ఆది అప్పటికి మది తన అక్కకి సపోర్ట్ చేస్తుండటంతో మదిపై మండిపడుతాడు. ఆ తర్వాత మదికి కోచింగ్ ఇవ్వనని బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో మది జైలుపాలు అవుతుంది. ప్రపంచ స్థాయిలో బాక్సింగ్ లో గెలిచి భారత్ కి స్వర్ణం తీసుకురావాలనుకున్న మది జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి ? తన కోచ్ ఆది ఆమెపై పెట్టుకున్న లక్ష్యాన్ని మది సాధించిందా?అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
బాక్సింగ్ కోచ్ గా మాధవన్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం మాధవన్ మూడేళ్ళు పడిన కష్టం తన ఫిజిక్ లో కనిపిస్తుంది. ఇక బాక్సింగ్ లో శిక్షణ తీసుకునే అమ్మాయి పాత్రలో రితిక సింగ్ నటన బాగుంది. తెరపై వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఈ చిత్రంలో ముంతాజ్ తో పాటు నాజర్, కాళీ వెంకట్ లు తమ పాత్ర పరిధి మేర నటించారు.
No comments:
Post a Comment